Posted on 2024-11-04 16:15:24
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: సర్పంచ్ లకు బకాయిల పైన బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు ముసలి కన్నీరు కారుస్తున్నారు అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
అధికారం పోయాక సర్పంచ్ లపైన బీఆర్ఎస్ నేతలు ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకున్నారు.
పదుల సంఖ్యలో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా ఆ కుటుంబాలను హరీష్ రావు ఏ నాడు పరామర్శించలేదు.
గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో సర్పంచ్ లతో లక్షలు ఖర్చు పెట్టించింది కేసీఆర్ సర్కార్.
సర్పంచ్ ల గొంతు పైన కత్తి పెట్టి రైతు వేదికలు, స్మశాన వాటికలు కట్టించారు.
సమయానికి పనులు చేయలేదని సర్పంచ్ లను సస్పెండ్ చేశారు.. మానసికంగా, ఆర్థికంగా చితికి పోయేలా చేశారు..
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించి పంచాయతీ ల పొట్ట కొట్టారు.
కేసీఆర్ తన గొప్ప కోసం పంచాయతీ లను ఆర్థికంగా దారుణంగా దెబ్బతీశారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన పాపాలను ఒక్కొక్కటి కడుగుకుంటు వస్తున్నాం..
40 వేల కోట్ల కు పైగా బకాయిలు పెట్టి పోయారు ఇప్పుడు ఆ బకాయిలను తీర్చడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
హరీష్ రావు ముందు సర్పంచ్ ల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి... అప్పుడే బకాయి లపైన మాట్లాడే నైతిక హక్కు ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >