భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాతపాల్వంచ 46 వ డివిజన్ లో జె.సి.బి. తో కాలువల పూడికలు తీయించిన కార్పొరేటర్ కొత్వాల విమల దేవి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాతపాల్వంచ 46వ డివిజన్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం రోడ్ లో కార్పొరేటర్ కొత్వాల విమల దేవి పర్యవేక్షణలో జె.సి.బి. తో కాలువల పూడికలు తీయించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాలమాట్లాడుతూ ప్రజలు తమ నివాసంలోని పరిసరాలను శుభ్రంగా ఉంచినప్పుడే ఎలాంటి అనారోగ్యాలు కలగవని అన్నారు.