Posted on 2026-04-13 16:18:09
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ సాయి అపార్ట్ మెంట్ లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే బాలకృష్ణ రాజంపేట ఎంపీడీవోగా పనిచేస్తు న్నారు. బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి పనిమీద ఫ్లాట్ కు తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. 40 తులాల బంగారం, 60తులాల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం బృందాలు వివరాలు సేకరించాయి. పోలీసులు అపార్ట్మెంట్, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ నరహరి తెలిపారు.
బాలకృష్ణ బాధితుడు
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >