| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజీవ్‌ రహదారిపై డివైడర్‌ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వైపు అతివేగంగా వెళ్తున్న కారు కుకునూర్‌ పల్లి వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాజీవ్‌ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ.. అవతలవైపు ఎదురుగా వస్తున్న మరోకారును బలంగా ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఎగిరి బలంగా రోడ్డుపై పడింది.

ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous విద్యుత్ స్తంభం పై నుండి పడ్డ ఔట్ సోర్సింగ్ హెల్పర్
Next సిరిసిల్ల పట్టణ అభివృద్దికి రూ. 2 కోట్లు మంజూరు : కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ హర్షం
ADVERTISEMENT