| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తుజల్పూర్ R&B రోడ్డుపై మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్... రోడ్డుపైకి తాగునీరు

తుజల్పూర్ R&B రోడ్డుపై మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్... రోడ్డుపైకి తాగునీరు

కామారెడ్డి / బీబీపేట (డైలీ భారత్): మండల కేంద్రం నుండి తుజల్పూర్ వెళ్లే ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి తాగునీరు రోడ్డుపైకి వస్తోంది.

ఈ విషయాన్ని బీబీపేట తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త, కామారెడ్డి జిల్లా ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నరసింహులు ఈరోజు ఉదయం 8:30 గంటలకు పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రోడ్డుపై నీరు పారుతుండటం వల్ల వాహనాలు అదే నీటిపై నుండి వెళుతున్నాయని, దీనివల్ల వివిధ రకాల బ్యాక్టీరియా, క్రిమి కీటకాలు తాగునీటిలో కలుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నీటిని తాగడం వల్ల విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది, ఆర్ అండ్ బి సిబ్బంది వెంటనే స్పందించి లీకేజీని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ నీరు తాగి ప్రజలు అనారోగ్యానికి గురైతే పూర్తి బాధ్యత గ్రామపంచాయతీ, ప్రభుత్వ అధికారులదేనని హెచ్చరించారు.

రేపు బీబీపేటకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యతో పాటు బీబీపేట డాబా బంగ్లా నుండి HP పెట్రోల్ బంక్ వరకు ఫోర్ లైన్ రోడ్డు, యాక్సిడెంట్లు, మినీ ట్యాంక్ బండ్, సండే మార్కెట్ విస్తరణ వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సర్పంచులు, చుట్టుపక్కల గ్రామస్తులు తీర్మానాలు చేసి ఇవ్వాలని కోరారు.

Previous మట్టి తల్లికి మళ్లీ ప్రాణం పోద్దాం : మంజుల పత్తిపాటి
Next వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల సంరక్షణ గాలికి వదిలేశారు : కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
ADVERTISEMENT