| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వృద్ధురాలి హత్య కేసును 5 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

వృద్ధురాలి హత్య కేసును 5 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

అనంతపురం (డైలీ భారత్):రక్త సంబంధాన్ని కాలరాస్తూ కాసుల కక్కుర్తితో వరుసకు బామ్మనే దారుణంగా హత్య చేసిన నిందితుడిని అనంతపురం జిల్లా పోలీసులు ఫిర్యాదు అందిన కేవలం 5 గంటల్లోనే అరెస్ట్ చేశారు.

అనంతపురం టౌన్, కోవూరునగర్‌లో నివాసముంటున్న మీసాల సన్నాగులు (87) అనే వృద్ధురాలు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఆమెపై దాడి చేశాడు. రోకలి కట్టెతో తలపై బలంగా బాది హత్య చేసిన అనంతరం, కట్టర్ బ్లేడుతో ఆమె చెవులు కోసి, చెవులకు ఉన్న బంగారు కమ్మలను దోచుకెళ్లాడు.

సమాచారం అందుకున్న వెంటనే ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

జిల్లా ఎస్పీ పి. జగదీష్, IPS ఆదేశాల మేరకు, అనంతపురం డీఎస్పీ కరుణాకర్ రావు పర్యవేక్షణలో, నగర సీఐలు మరియు సీసీఎస్ సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. శాస్త్రీయ దర్యాప్తు, ఆధారాల సేకరణతో హతురాలికి వరుసకు మనవడైన లక్ష్మినారాయణ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు.

సోమవారం రాత్రి రామనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నిందితుడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని కన్ఫెషన్ మేరకు హతురాలి రెండు బంగారు చెవి కమ్మలు, నేరానికి ఉపయోగించిన కట్టర్ బ్లేడును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు హతురాలి సొంత మనవడైన గోపాల్‌కు బావమరిది. అతని స్వగ్రామం పెద్దపప్పూరు మండలం చిక్కేపల్లి.

కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ పి. జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు. నేరం చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

Previous సిరిసిల్ల BRS సీనియర్ నేత గూడూరి ప్రవీణ్‌కు డాక్టరేట్...
Next మట్టి తల్లికి మళ్లీ ప్రాణం పోద్దాం : మంజుల పత్తిపాటి
ADVERTISEMENT