| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి వాసులకు గుడ్ న్యూస్... అందుబాటులోకి అమ్మ హాస్పిటల్

కామారెడ్డి వాసులకు గుడ్ న్యూస్... అందుబాటులోకి అమ్మ హాస్పిటల్

కామారెడ్డి (డైలీ భారత్): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన "అమ్మ హాస్పిటల్" ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

బిక్కనూర్ మండలం అంతంపల్లి సొసైటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నూతన ఆసుపత్రి ఏర్పాటు వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని ఆకాంక్షించారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, పలువురు ప్రముఖులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Previous జ్ఞానేష్‌ కుమార్‌పై అవినీతి ఆరోపణలు... విచారణకు ఆదేశించిన కేరళం ప్రభుత్వం
Next సిరిసిల్లలో వైద్యుల నిర్లక్ష్యం... ఎడమ కంటికి బదులు కుడి కంటికి సర్జరీ!
ADVERTISEMENT