| Daily భారత్
Logo




వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

News

Posted on 2026-04-13 16:39:06

Share: Share


వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ హత్యకు గురైంది.

కున్నం తాలూకా పుదువెట్టక్కుడి గ్రామానికి చెందిన పెరియసామి–నందిని(28) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం పెరియసామి అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత నందిని తన పిల్లలను అత్తగారింట్లో వదిలి, పెరంబలూర్లోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేపట్టింది

అదే హోటల్‌లో పనిచేస్తున్న పచ్చముత్తుతో నందిని సన్నిహితమైంది. ఈ విషయం పచ్చముత్తు భార్య సత్యకు తెలిసి, ఆమె భర్తను మందలించింది. అయినా అతను మారకపోవడంతో మనస్తాపానికి గురైన సత్య సుమారు ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకుంది.

సత్య మరణం తర్వాత పచ్చముత్తు, నందిని కలిసి భారతీనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ మధ్య నందిని ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడుతుండటంపై పచ్చముత్తుకు అనుమానం వచ్చి తరచూ గొడవలు జరిగేవి.శనివారం రాత్రి ఇద్దరి మధ్య మళ్లీ గొడవ చెలరేగింది. కోపంతో పచ్చముత్తు దాడి చేయడంతో నందిని అక్కడికక్కడే మృతి చెందింది.

అనంతరం పచ్చముత్తు స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Image 1

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

Posted On 2026-04-13 17:33:33

Readmore >
Image 1

జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం

Posted On 2026-04-13 17:32:13

Readmore >
Image 1

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

Posted On 2026-04-13 17:30:28

Readmore >
Image 1

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

Posted On 2026-04-13 17:28:31

Readmore >
Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >