| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొమ్ముగూడెంలో ఘనంగా పెద్దమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం... 24 మంది భక్తుల మాలధారణ

కొమ్ముగూడెంలో ఘనంగా పెద్దమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం... 24 మంది భక్తుల మాలధారణ

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామానికి చెందిన 24 మంది భక్తులు అమ్మవారి మాలధారణ స్వీకరించారు. పూజారి వేద మంత్రాలతో వారికి రుద్రాక్ష మాలలు వేసి దీక్షా నియమాలను వివరించారు.

9 రోజుల పాటు ఈ భక్తులు అమ్మవారి దీక్షలో ఉండి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆలయంలో జరిగే పూజలు, భజన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Previous పెళ్లి పేరిట మోసం... ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి అరెస్ట్!
ADVERTISEMENT