| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో బీజేపీ vs కాంగ్రెస్... దిష్టిబొమ్మ దహనంపై రచ్చ, రాహుల్, ప్రియాంకపై ఫైర్

సిరిసిల్లలో బీజేపీ vs కాంగ్రెస్... దిష్టిబొమ్మ దహనంపై రచ్చ, రాహుల్, ప్రియాంకపై ఫైర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీరుపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తీవ్ర విమర్శలు చేశారు.

సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఉన్నా, హుందాతనం పాటించాలన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జాతీయ నాయకులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల అభివృద్ధి, దేశ గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, పట్టణ ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సమావేశంలో దేవరాజు, నరసయ్య, మోర రవి, దూడం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Previous పసికందుకు బంగారు ఉంగరం తొడిగిన సీఎం విజయ్
ADVERTISEMENT