| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో విషాదం - చెరువులో మునిగి ముగ్గురు పిల్లల తండ్రి మృతి

సిరిసిల్లలో విషాదం - చెరువులో మునిగి ముగ్గురు పిల్లల తండ్రి మృతి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో చెరువులో మునిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

గ్రామానికి చెందిన మోతే ఎల్లయ్య, ఎల్లవ్వ దంపతుల కుమారుడు మోతే కిరణ్ స్నేహితులతో కలిసి చేపలు, తాబేళ్లు పట్టేందుకు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో లోతైన ప్రాంతానికి వెళ్లి నీటమునిగాడు.

నిన్న సాయంత్రం నుంచి గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం కిరణ్ మృతదేహాన్ని వెలికితీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కిరణ్‌కు భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కిరణ్ మృతితో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో వెంకటాపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది

 #Sircilla #Ellareddypet #Venkatapur #DailyBharat

Previous రైతు బిడ్డకు ఉద్యోగం రాగానే మొదట మారేది భాష, తర్వాత వేషం, చివరికి తల్లిదండ్రులే!
ADVERTISEMENT