| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ధమ్మన్నపేట పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు

ధమ్మన్నపేట పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు

డైలీ భారత్, ధమ్మన్నపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధమ్మన్నపేటలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.

ఉదయం పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థినీ విద్యార్థులు పూలు సేకరించి అందంగా బతుకమ్మలు పేర్చి రెండు గంటల పాటు ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగలలో బతుకమ్మ పండుగ ప్రధానమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ, మారెపల్లి రాజు, గుడికాడి కొమురయ్య, శనిగరం నారాయణ, అజ్మీరా కవిత, జడల విజయశ్రీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

 #Bathukamma #Dhammannapeta #ZPHS #DailyBharat

Previous "ఆదివారం సిరిసిల్లలో ప్రతిభాదీప్తి పురస్కారాల ప్రదానం... విజేతలు వీరే!"
Next భారతదేశంలో "ఓట్ చోరీ" కింద ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు : వాస్తవ తనిఖీ
ADVERTISEMENT