డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సాహిత్య సమరంలో యువ కవి, రచయిత అంకారపు రవిని నాయకులు చిరు సత్కారంతో గౌరవించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, గజబింకర్ రాజన్న, పడిగల రాజు, ఎండీ సత్తర్ తదితరులు పాల్గొని అంకారపు రవిని సత్కరించారు.
తనను గౌరవించిన నాయకులందరికీ అంకారపు రవి కృతజ్ఞతలు తెలిపారు.
#Sircilla #AnkarapuRavi