Posted on 2026-04-13 16:25:36
ఏప్రిల్ 13 నుంచి కామారెడ్డి జిల్లాలో విస్తృత కార్యక్రమాలు
డైలీ భారత్, కామారెడ్డి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్, రవాణా, ఆర్ & బి, విద్య, వైద్య శాఖల సమన్వయంతో “Arrive Alive” ఇతివృత్తంతో ఏప్రిల్ 13 నుండి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టర్ చాంబర్ లో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా చేపట్టే అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పాదచారులు, వాహనదారులకు రహదారి భద్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >