| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ్యక్తిగత విషాదం నుంచి సమాజ సేవకు... ప్రదీప్తి ఫౌండేషన్ ఆదర్శం

వ్యక్తిగత విషాదం నుంచి సమాజ సేవకు... ప్రదీప్తి ఫౌండేషన్ ఆదర్శం

డైలీ భారత్, సిరిసిల్ల: వ్యక్తిగత విషాదం నుంచి బయటపడి సమాజ సేవకు ముందుకు రావడం ఆదర్శనీయమని పలువురు వక్తలు అన్నారు. ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా దీప్తి పురస్కారాల ప్రదానోత్సవం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, డాక్టర్ గూడూరి ప్రవీణ్, సుప్మ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ళ జగన్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ అతిథులుగా హాజరై మాట్లాడారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు అర్థంతరంగా కన్నుమూసిన విషాదాన్ని కడుపులో దాచుకుని సమాజ సేవకు ముందుకు రావడం విశేషమని, విభిన్న రంగాల్లో ప్రతిభావంతులను సత్కరించడం మంచి సంప్రదాయమని అన్నారు.

పురస్కార విజేతలు వీరే...

చదువు, సాహిత్యం, క్రీడలు, చిత్రలేఖనంతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలను అందజేశారు.

👉 విద్యారంగంలో: డాక్టర్ గూడూరి ప్రవీణ్

👉 సామాజిక సేవారంగంలో:*లగిశెట్టి శ్రీనివాస్

👉 నిర్వహణ రంగంలో: శ్రీగాద గణేశ్, కూనపులి సురేందర్

👉 సాహిత్యంలో: కృషి శతకం కృతికర్త గంభీరావుపేటకు చెందిన పర్సకుర్మ రిషిక

👉 క్రీడారంగంలో: బత్తుల అక్షర

👉 పర్వతారోహణ రంగంలో: నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన విస్లావత్ బన్నీ

👉 జీవన సాఫల్య పురస్కారం: ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీ వాణి రమణారావు

ఈ కార్యక్రమంలో అల్లాడి చంద్రశేఖర్, కళ్లేపెళ్లి అశోక్, గెంట్యాల రాజా శేఖర్, తెలంగాణ వికాస సమితి ప్రతినిధి ఫణి రాజారావు, గజ్జెల దేవరాజు, పలువురు అడ్వకేట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


 #Sircilla #PradeeptiFoundation

Previous రాజన్న సిరిసిల్ల దశాబ్ది వేడుకల్లో కవి అంకారపు రవికి చిరు సత్కారం
Next ఉపాధ్యాయుడి భూకబ్జాపై చర్యలు తీసుకోవాలి : గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్
ADVERTISEMENT