| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలం మరియు జిల్లా కేంద్రంలో చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి లో వినతి పత్రం అందజేయడం జరిగింది.  దుర్గా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటికే వేసవి కాలం ప్రారంభమైనప్పటికీ చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కొత్త చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉన్నా కేంద్రంలలో జిల్లా అధికారులు చర్యలు తీసుకొని వేసవికాలం దృష్ట్యా నీటి సరఫరా, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, హెల్త్ క్యాంపులు పరిశుభ్రత విద్యుత్ సౌకర్యం వంటి సమస్యలు లేకుండా ఉండాలని ఆయన అన్నారు. బిజీగా ఉండే ప్రాంతాలు ట్రాఫిక్ సిగ్నల్స్, బస్టాండ్లు రైల్వేటేషన్లు, మార్కెట్ ప్రాంతాలు ఉండేచోట్ల తక్షణమే చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.

Previous జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Next ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
ADVERTISEMENT