| Daily భారత్
Logo




రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

News

Posted on 2026-04-13 19:58:53

Share: Share


రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా :తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పరిధిలో పలు వార్డులలో ఈరోజు  రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టి రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేశారు.

ఈసందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించి, వాటిని కచ్చితంగా పాటించాలని, సురక్షిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిజ్ఞను చేయించారు.

ఈసందర్భంగా డిఎస్పీ  మాట్లాడుతూ.. రోడ్డు భద్రత, సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించగలమన్నారు.రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, ఎక్కువ శాతం ప్రమాదాలు మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం,హెల్మెట్, సీటుబెల్ట్ వాడకంలో అలసత్వం వంటి కారణాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు.ఈపరిస్థితిని మార్చేందుకు అవగాహన అత్యంత అవసరమని భావించి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు.ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేసే వారితో పాటు వెనుక కూర్చునే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, వాహనం నడిపే సమయంలో సిట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలన్నారు.రక్షణాత్మక డ్రైవింగ్ దృష్టి పెట్టాలని, అప్రమత్తంగా, సురక్షితంగా ఉండటం చాల కీలకమని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్  శ్రీనివాస్,శ్రీకాంత్ సిబ్బంది వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >
Image 1

ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Posted On 2026-04-13 19:09:44

Readmore >