| Daily భారత్
Logo




దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

News

Posted on 2026-04-13 20:04:47

Share: Share


దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.

అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఒక మే 14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది. సీట్ల కేటాయింపు అనంతరం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 30వ తేదీ సీట్లు కేటాయిస్తారు. మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరగనుంది. జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత సీట్ల కేటాయింపు అనంతరం కూడా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియక పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

Image 1

ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-13 21:33:35

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత

Posted On 2026-04-13 21:08:28

Readmore >
Image 1

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

Posted On 2026-04-13 20:45:38

Readmore >
Image 1

నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం

Posted On 2026-04-13 20:40:46

Readmore >
Image 1

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్

Posted On 2026-04-13 20:38:38

Readmore >
Image 1

దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్య - మగువ

Posted On 2026-04-13 20:37:19

Readmore >
Image 1

దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల..

Posted On 2026-04-13 20:04:47

Readmore >
Image 1

రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-13 19:58:53

Readmore >
Image 1

ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం దోపిడీ

Posted On 2026-04-13 19:14:12

Readmore >
Image 1

ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Posted On 2026-04-13 19:09:44

Readmore >