| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు:  జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పెండింగ్‌లో ఉన్న అటవీ, అసైన్డ్ భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ జిల్లాలో అసైన్డ్ భూములకు సంబంధించిన వివిధ సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూములపై అక్రమ ఆక్రమణలను కఠినంగా అరికట్టాలని, ఎక్కడైనా అక్రమాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భూముల రికార్డులను సక్రమంగా నవీకరించి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. సర్వే నెంబర్ వారీగా ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల పూర్తి వివరాలను సేకరించి సమగ్ర నివేదికలను తక్షణమే అందజేయాలని సూచించారు. భూముల ప్రస్తుత స్థితి, సమస్యలు, ఆక్రమణల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.

ఆక్రమణకు గురైన భూములపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు.

అసైన్డ్ భూముల అంశాలలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు మరియు సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

#BhadradriKothagudem #LandIssues #AssignedLands #ForestLands #RevenueDept #Telangana

Previous ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Next జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
ADVERTISEMENT