డైలీ భారత్, వేములవాడ: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి శుక్రవారం ఐపీఎస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకున్న వెంటనే పోలీస్ బృందం గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తి వాచకంతో ఘనంగా స్వాగతం పలికారు. తరువాత స్వామివారి మండపంలో అర్చకులు వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ జి.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News
వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు