డైలీ భారత్, సూర్యాపేట: మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) సౌజన్యంతో ₹10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ సందర్శించారు.
అనంతరం కోదాడలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ అతిథి గృహాన్ని (R&B Guest House) పరిశీలించి, పనుల్లో నాణ్యత పాటించాలని మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో RDO సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.