Posted on 2026-04-24 13:50:12
డైలీ భారత్, మహాబాబాబాద్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ మలేరియా దినోత్సవం (వరల్డ్ మలేరియా డే )"ను నిర్వహించడం జరుగుతుందని మహబూబాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ నేడు ఒక ప్రకటన లో తెలిపారు. 2026 సంవత్సరం కు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మలేరియా అంతానికి ప్రేరణ, ఇప్పుడు మనవల్ల అవుతుంది. ఇప్పుడు మనం తప్పక చేయాలి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందన్నారు.
మలేరియా వ్యాధి ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా ఉందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే సంక్రమణ వ్యాధి.
జిల్లాలో మలేరియా కేసులను పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం అని తెలిపారు.ఈ దినోత్సవాన్ని నిర్వహించుట యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో మలేరియా వ్యాధి పై అవగాహన పెంచడం, దోమల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, మరియు ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకొని చికిత్స పొందేలా ప్రోత్సహించడం. జిల్లాలో మలేరియా నివారణకు చేపడుతున్న చర్యల గురించి తెలుపుతూ గ్రామాలలో ఫీవర్ సర్వేలు నిర్వహించడం, అనుమానిత కేసులకు వెంటనే రక్త పరీక్షలు చేయించడం, పాజిటివ్ కేసులకు తక్షణ చికిత్స అందించడం, దోమల పెరుగుదలను అరికట్టడానికి నిల్వ నీటిని తొలగించడం, అవసరమైన చోట ఫాగింగ్ లార్విసైడల్ చర్యలు చేపట్టడం మలేరియా నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండనీయకూడదనీ దోమతెరలు ఉపయోగించాలనీ పూర్తి చేతుల దుస్తులు ధరించాలనీ,
జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి “మలేరియా పూర్తిగా నివారించగలిగే వ్యాధి అని ప్రజల సహకారం ఉంటే మాత్రమే ఈ వ్యాధిని నిర్మూలించవచ్చునీ , అందరూ కలిసి మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం” అని తెలిపారు.
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >