| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Health

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

డైలీ భారత్, హైదరాబాద్: దేశంలో HIV నివారణకు కీలక ముందడుగు పడింది. ఏడాదికి రెండుసార్లు వేసుకునే లెనాకాపవిర్ (Lenacapavir) ఇంజెక్షన్ తయారీకి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఎంక్యూర్ ఫార్మాకు CDSCO నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆగస్టు 11న జరిగిన SEC మీటింగ్‌లో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఔషధానికి లోకల్ ఫేజ్-3 ట్రయల్స్, బయోఈక్వివలెన్స్ స్టడీ నుంచి మినహాయింపు ఇచ్చింది. 463.5 mg/1.5 ml డోస్‌లో ఉన్న ఈ ఇంజెక్షన్, 35 కేజీలు పైబడిన వారిలో HIV రిస్క్ తగ్గించే PrEP గా వాడతారు.

అమెరికాలో ఈ ఇంజెక్షన్ ధర ఏడాదికి సుమారు $28,000 ఉండగా, గిలీడ్ సైన్సెస్ నుంచి రాయల్టీ రహిత లైసెన్స్ పొందడంతో భారత్‌లో ధర 50-70% వరకు తగ్గనుంది.

CDSCO మాత్రం ఒక షరతు పెట్టింది. మార్కెటింగ్ అనుమతి వచ్చిన 3 నెలల్లో ఫేజ్-4 ఎఫికసీ స్టడీ ప్రోటోకాల్ సబ్మిట్ చేసి స్టడీ చేయాలి.

త్వరలోనే ఈ జెనరిక్ ఇంజెక్షన్ భారత్‌తో పాటు 120 దేశాల్లో అందుబాటులోకి రానుంది.

Previous సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Next డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”
ADVERTISEMENT