| Daily భారత్
Logo




ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

News

Posted on 2026-04-17 08:35:45

Share: Share


ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 40 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. ప్రతి కేసులో దర్యాప్తు వేగవంతం చేసి, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని, చార్జ్‌షీట్లు ఆలస్యం లేకుండా దాఖలు చేయాలని అధికారులకు సూచించారు.

బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు ప్రభుత్వ పరిహారం, పునరావాస సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేస్తూ, శాఖల మధ్య సమన్వయం పెంచి కేసుల పరిష్కారంలో వేగం తీసుకురావాలని తెలిపారు.

బాధితుల గోప్యత, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ హక్కులపై చైతన్యం పెంపొందించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మాట్లాడుతూ ప్రతి కేసును సున్నితంగా తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీ రాంబాయి, కోలూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

#BhadradriKothagudem #SCSTWelfare #SocialJustice #AtrocityCases #LawAndOrder #Telangana

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >