| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రామారెడ్డి PHC ఆకస్మిక తనిఖీ: వైద్య సేవలపై జిల్లా అధికారి డా. వెంకట్ ఆరా

రామారెడ్డి PHC ఆకస్మిక తనిఖీ: వైద్య సేవలపై జిల్లా అధికారి డా. వెంకట్ ఆరా

డైలీ భారత్, కామారెడ్డి: రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. వెంకట్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సేవలు, మందుల లభ్యత, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.

ఆసుపత్రిలో పరిశుభ్రతను నిరంతరం పాటిస్తూ, మందులు మరియు ఇతర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Previous కామారెడ్డి : బీబీపేట్ PACS చైర్మన్‌గా సుతారి రమేష్ ప్రమాణం, హాజరైన షబ్బీర్ అలీ
ADVERTISEMENT