| Daily భారత్
Logo




మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2026-04-17 08:16:17

Share: Share


మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళలందరూ అక్షరాస్యూలు గా అభివృద్ధి చెందాలని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు.99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం షాబాద్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో నోడల్ ఆఫీసర్ రామ్ రెడ్డి, ఎంఆర్ఓ అన్వర్, ఎంపిడిఓ అపర్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర గీతం తో

మండల సభను ఆయన ప్రారంభించారు. ఎంపీడీవో ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.మండల సభ లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్ లను వారు సందర్శించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇప్పటికి తెలంగాణలోని 558 మండలాలలో మహిళలను బస్సులకు యజమానులను చేసినట్లు వెల్లడించారు. కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్న, కాంట్రాక్టు పద్ధతిలో బస్సులు తీసుకోవాలన్న ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతలను మహిళలకు అప్పగించి ఉపాధి దిశగా వారిని ముందడుగు వేయించడమే కాకుండా బస్సుల కొరత కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. కేవలం బస్సులు మాత్రమే కాకుండా సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులను కూడా మహిళలకు అందిస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాల భవనాలను కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మాణం తలపెట్టిందని. ఇందులో భాగంగా మూడు నెలల్లో 8000 భవనాలను నిర్మించేందుకు శ్రీకారం జరిగిందని అన్నారు. పలు గ్రామాలలో గ్రామపంచాయతీ ద్వారా మహిళా సంఘానికి స్థలాన్ని మహిళలు తమ హక్కుగా తీసుకున్నరని, మహిళలలో అక్షరాస్యతను పెంచే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పని చేయాలని అన్నారు. ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరాలని ఆ దిశగా అందరూ పని చేయాలని అన్నారు. జిల్లాలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణ పక్కాగా అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోట లక్ష్మి,గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు, వార్డు సభ్యులు,అధికారులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >