డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రియుడికి పుట్టినరోజు కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఖరీదైన వాచీలను దొంగిలించిన యువతి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.ఖమ్మం జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి కారులో జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ వాచ్ షోరూమ్‌కు వెళ్లింది. ప్రియుడిని కారులోనే కూర్చోబెట్టి, ఆమె కస్టమర్‌లా నటిస్తూ షోరూమ్‌లోకి ప్రవేశించింది.అక్కడ సేల్స్‌మెన్‌ను మాటల్లో పెట్టి, సుమారు రూ.2 లక్షల విలువైన రెండు ఖరీదైన తీస్సోట్ వాచీలను చాకచక్యంగా తన హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి పరారైంది. వాచీలు కనిపించకపోవడంతో షోరూమ్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, యువతి వచ్చిన కారు నంబర్ ఆధారంగా ఆమెను ఖమ్మంలో గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత విచారణ కొనసాగిస్తున్నారు.
News
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్