Posted on 2026-04-17 07:41:26
రూ.10 లక్షల బిల్లు పాస్ చేసేందుకు రూ.30 వేల డిమాండ్
డైలీ భారత్, నల్గొండ జిల్లా: విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్గొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు #ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
కంబాలపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో అక్టోబర్ 2025లో వీచిన గాలివానకు దెబ్బతిన్న 33/11 కేవీ విద్యుత్ లైన్లను ఓ వ్యక్తి పునరుద్ధరించాడు.
ఇందుకు సంబంధించిన రూ.10 లక్షల బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపేందుకు సదరు ఏడీఈ రూ.30 వేలు డిమాండ్ చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఏప్రిల్ 16న తన కార్యాలయంలో లంచం డబ్బులు తీసుకుంటుండగా సైదులును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, అతని వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
విధి నిర్వహణలో అవినీతికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >