| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమాజానికి ఆదర్శం ఉపాధ్యాయులు

సమాజానికి ఆదర్శం ఉపాధ్యాయులు

 డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ మాట్లాడుతూ సమాజానికి ఉపాధ్యాయులు ఆదర్శనీయులని, 29 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని పవిత్ర కార్యంగా భావించి అనేక మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన నసీరుద్దీన్ సేవలను కొనియాడారు. ఉపాధ్యాయుడిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ కుటుంబాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దారని అన్నారు. నసీరుద్దీన్ కి ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఉమా, మాజీ కౌన్సిలర్  శ్రీనివాస్, స్టాఫ్ సెక్రటరీ శంకర్ గౌడ్ మరియు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.

Previous దారుణం... కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి
Next ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక
ADVERTISEMENT