Posted on 2025-12-30 11:44:50
డైలీ భారత్, గద్వాల:గద్వాల జిల్లాలో కన్నతండ్రే కూతురిపై అత్యాచారానికి పాల్పడి, గర్భవతిని చేశాడు. ఈ ఘోరానికి మొదటి భార్య కూడా సహకరించడం విచారకరం. బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా విషయం బయటపడింది. పోలీసులు నిందితుడితో పాటు సహకరించిన మొదటి భార్యను అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాజం తలదించుకునేలా, మానవత్వం మంటగలిసిపోయేలా గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దారుణ ఘటన విస్మయానికి గురిచేస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి.. వావివరసలు మరచి కన్నబిడ్డపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణానికి ఆ వ్యక్తి మొదటి భార్య కూడా తోడవ్వడం, ఒక మహిళ అయి ఉండి తోటి ఆడపిల్లపై జరుగుతున్న అన్యాయాన్ని ఆపాల్సింది పోయి దగ్గరుండి సహకరించడం విచారకరం. కంచే చేను మేసిన చందంగా.. రక్షణగా ఉండాల్సిన ఇల్లే ఆ బాలికకు నరకప్రాయంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ...
నిందితుడికి ఇద్దరు భార్యలు కాగా.. మెుదటి భార్యకు పిల్లలు పుట్టకపోవటంతో ఆమె చెల్లిని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు నలుగురు సంతానం కాగా.. ఆ తర్వాత మెుదటి భార్యకు సైతం ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే రెండో భార్యకు పుట్టిన 16 ఏళ్ల కూతురిపై అతడు కన్నేశాడు. కుటుంబ సభ్యులంతా కూలి పనులకు వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని.. కూతురిపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చగా.. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆ తండ్రి, అతని మొదటి భార్య కలిసి అబార్షన్ చేయించారు. శారీరక, మానసిక వేదనను అనుభవిస్తున్న ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోయింది.
ఇటీవల సదరు బాలికకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పక్కింటి మహిళతో తన బాధను పంచుకోగా.. ఆ మహిళ జరిగిన ఘోరాన్ని గుర్తించి బాలిక కన్నతల్లికి సమాచారం అందించింది. కన్నబిడ్డకు జరిగిన అన్యాయాన్ని విన్న ఆ తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన గద్వాల పోలీసులు నిందితుడితో పాటు అతడికి సహకరించిన మొదటి భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై పోక్సో చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
కన్నబిడ్డ జీవితాన్ని నాశనం చేసిన ఆ నిందితుడికి, అతడికి సహకరించిన మహిళకు చట్టం ద్వారా అత్యంత కఠినమైన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >