| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అయ్యప్ప సన్నిధానం నిర్మాణం కోసం లక్ష రూపాయలను విరాళంగా అందజేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

అయ్యప్ప సన్నిధానం నిర్మాణం కోసం లక్ష రూపాయలను విరాళంగా అందజేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వాముల సన్నిధానం నిర్మాణం కోసం మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. సన్నిధానం నిర్మాణంలో భాగంగా తమకు అనువైన విధంగా డబ్బులను  వినియోగించుకోవాలని సూచించారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ తమ ఇష్ట దైవాన్ని నిత్యం పూజించాలని, శ్రీ అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తే మంచి జరుగుతుందని ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ అభిప్రాయపడ్డారు. సన్నిధానం నిర్మాణం కోసం విరాళాన్ని అందజేయడం పట్ల గ్రామ అయ్యప్ప స్వామి భక్తులు, గ్రామస్తులు వర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడిచెర్ల బీఆర్ఎస్ నాయకులు నరసింహా రెడ్డి, జంగయ్య యాదవ్, మాణిక్యం రెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు..

Previous జనవరి నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్
Next దారుణం... కూతుర్ని గర్భవతిని చేసిన తండ్రి
ADVERTISEMENT