Posted on 2026-04-10 18:25:23
వివరాలు వెల్లడించిన డిఎస్పీ నాగేంద్రచారి.
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్ కి చెందిన 32 సంవత్సరాల యువకుడు , పాత బస్టాండ్ కి చెందిన 26 సంవత్సరాల యువకుడు, రాజీవ్ నగర్ చెందిన మరో బాలుడు ముగ్గురు కలసి గంజాయి కి తాగడానికి అలవాటు పడి మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన గుర్తుతెలియని వ్యక్తుల నుండి గంజాయిని తీసుకువచ్చి సిరిసిల్ల పట్టణ పరిధిలోని కే -కన్వెన్షన్ హాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు నిన్నటి రోజున సాయంత్రం సమయంలో తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారికి గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయ్యిందని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా తాము గంజాయి అలవాటు నుండి బయటపడాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, చికిత్స పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపగా NDPS యాక్ట్ ప్రకారం గౌరవనీయ న్యాయస్థానం అనుమతితో వారిని సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపడం జరిగిందని తెలిపారు. గంజాయి సంబంధిత సమాచారం లేదా గంజాయి అలవాటుకు బానిసై మానలేని స్థితిలో ఉన్న వ్యక్తుల వివరాలు తెలిసిన పక్షంలో సమీప పోలీసులకు సమాచారం అందించండి. అట్టి వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైతే డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించి పునరావాసం కల్పించడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమం లో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీకాంత్ సిబ్బంది ఉన్నారు.
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >