| Daily భారత్
Logo




యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

News

Posted on 2026-08-04 08:26:26

Share: Share


యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని జూలూరుపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జూలూరుపాడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎరువుల బుకింగ్ ప్రక్రియలో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది రైతులకు స్మార్ట్‌ఫోన్‌లు లేకపోవడం, ఉన్నవారికి కూడా యాప్‌ల వినియోగంపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

రైతులు చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాదని వ్యవసాయం. ఎరువులు కొనుగోలు చేయడానికి యాప్‌లు, ఆన్‌లైన్ బుకింగ్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదని అన్నారు . ప్రస్తుతం యూరియా బుకింగ్ జరుగుతున్నట్లు ఆగస్టు ఆరో తారీకు నుండి మిగతా కాంప్లెక్స్ ఎరువులు కూడా అలానే బుక్ చేసుకోవాలని వస్తున్న కథనాలను అదునుగా ఎరువుల డీలర్లు రైతులను మరింతగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఇదే అదునుగా వారి గోడౌన్లు ఖాళీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కావున రైతులకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ద్వారా నేరుగా ఎరువులను పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు వ్యతిరేకంగా మారుతున్న ఈ విధానాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి, రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఉసికల రమేష్ విజ్ఞప్తి చేశారు.

Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >