| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సోమాజిగూడ ఆల్ పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

సోమాజిగూడ ఆల్ పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సోమాజిగూడలోని క్షత్రియ హోటల్ సమీపంలో ఉన్న ఆల్ పైన్ హైట్స్ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ అయిదవ అంతస్తులో అకస్మాత్తుగా సిలిండర్ పేలడంతో భారీ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం వల్ల అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌కు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Previous 2025లో భారత్ బలమేంటో ప్రపంచం చూసింది...మన్ కీ బాత్‍లో మోడీ
Next గ్రామాభివృద్ధికి సర్పంచులు అహర్నిశలు కృషి చేయాలి : గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT