| Daily భారత్
Logo




2025లో భారత్ బలమేంటో ప్రపంచం చూసింది...మన్ కీ బాత్‍లో మోడీ

News

Posted on 2025-12-28 14:51:59

Share: Share


2025లో భారత్ బలమేంటో ప్రపంచం చూసింది...మన్ కీ బాత్‍లో మోడీ

ఇవాళ 129వ మన్ కీ బాత్ ఎడిషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ

డైలీ భారత్ తెలంగాణ డెస్క్ : కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో 2026లోకి అడుగు పెడుతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ  అన్నారు. ప్రయాగ్ రాజ్ కుంభమేళాతో ప్రారంభమైన 2025 సంవత్సరం భారతదేశం జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ వంటి ప్రతి అంశంలో ప్రపంచంలోని అతిపెద్ద వేదికల్లో బలమైన ముద్ర వేసిందన్నారు.

మన్ కీ బాత్ ఎడిషన్ కార్యక్రమంలో  దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. 2025 సంవత్సరంలోని అంశాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారడానికి ఎన్నో క్షణాలను ఇచ్చిందని ఆపరేషన్ సిందూర్ మారుతున్న భారతావనిగా అభివర్ణించిన మోడీ.. సైనిక విజయాన్ని దేశవ్యాప్త దేశభక్తిని పెంచిన ఘటనగా ప్రశంసించారు. ఈ ఆపరేషన్ ఈ ఏడాది ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‍తో నేటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీపడదని ప్రపంచం స్పష్టంగా చూస్తుందని చెప్పారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలు అదే స్ఫూర్తిని మరియు ఉత్సాహాన్ని చూపించినందుకు మోడీ అభినందించారు.

వికసిత్ భారత్ ద్వారా దేశం అన్ని విభాగాల్లో ముందుకెళ్తోందని మోడీ చెప్పారు. రెండో యంగ్ ఇండియా లీడర్ సదస్సు జనవరి 12న జరగనుందని ఇందులో వివిధ ప్రాంతాల యువత తమ ఆలోచనలు పంచుకుంటారని చెప్పారు. యంగ్ ఇండియా లీడర్ సదస్సులో నేనూ తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో విద్యార్థులు 70 అంశాలపై ప్రతిభ చూపారని స్మార్ట్ ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీపై ఆవిష్కరణలు ప్రదర్శించారన్నారు. 2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంటే మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మహిళల అంధుల T20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత కుమార్తెలు చరిత్ర సృష్టించారని మోడీ ప్రశంసించారు. ఆసియా కప్ T20లో త్రివర్ణ పతాకం కూడా గర్వంతో రెపరెపలాడిందని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు గెలుచుకున్నందుకు పారా-అథ్లెట్లను కూడా ఆయన ప్రశంసించారు. గతేడాది వారణాసిలో కాశీ-తమిళ సంగమం జరుపుకున్నాం.వారణాసిలోని పిల్లలు తమిళం మాట్లాడుతున్నారు. మాతృభాష హిందీ అయినప్పటికీ తమిళం నేర్చుకుని మాట్లాడుతున్నారన్నారు. దేశంలో చిరుతల సంఖ్య 30 దాటిందని గుర్తు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, మహిళా సాధికారత, వోకల్ ఫర్ లోకల్ దేశీయ ఉత్పుత్తుల ప్రోత్సాహం వంటి అంశాలను మోడీ ప్రస్తావించారు.

Image 1

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

Posted On 2026-04-10 05:06:54

Readmore >
Image 1

ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు

Posted On 2026-04-10 05:05:52

Readmore >
Image 1

మార్పు కోసం నా అక్షరాలు-మంజుల పత్తిపాటి

Posted On 2026-04-10 02:51:39

Readmore >
Image 1

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో జీతాల కుంభకోణం

Posted On 2026-04-10 02:02:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >