| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

సెల్ఫీ మోజు... ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది!

డైలీ భారత్, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాకు సమీపంలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న మలంగుమ్మి వాటర్‌ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

సరదాగా పిక్నిక్‌కు వెళ్లిన ఐదుగురు బాలికల్లో ముగ్గురు – త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) – సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ ఘటన సెల్ఫీ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. వాటర్‌ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారుడు ఉండటం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

Previous ఇకపై గంట ఆలస్యంగా రూ. 10,000 పైన డిజిటల్ చెల్లింపులు
Next ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
ADVERTISEMENT