| Daily భారత్
Logo




హద్దులు దాటిన ప్రేమ.. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఒక్కటైన నవ పెళ్లిజంట

News

Posted on 2025-10-17 19:12:19

Share: Share


హద్దులు దాటిన ప్రేమ.. కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ ఒక్కటైన నవ పెళ్లిజంట

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రేమకు కులం, మతం, జాతులు, దేశాలు వేరైనా తమ ప్రేమను గెలిపించుకుంటామని నిరూపించుకున్నారు ఓ యువ జంట. ప్రేమను గెలిపించుకోవడమే కాదు కుటుంబ పెద్దలను ఒప్పించి మరి తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుపుకున్నారు ఆ నవ వధువు, వరుధులు.. దేశం కానీ దేశం లో ప్రేమించుకొని భారతీయ సంప్రదాయం పద్దతిలో పెళ్లి చేసుకున్న నేపాల్ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి పెళ్లివేడుక కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో జరిగింది. మహమ్మద్ నగర్ మండలం తెలగపూర్ గ్రామానికి చెందిన రవీందర్ గత ఐదు సంవత్సరాలుగా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు. అక్కడే తన ఆపీస్ లో పనిచేస్తున్న నేపాల్ యువతీ తో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు ఒప్పుకోవడంతో యువతీ యువకుడు ఇండియా కు వచ్చి గురువారం గ్రామంలో ఘనంగా పెళ్లివేడుక చేసుకున్నారు. నూతన దంపతులను గ్రామస్తులు, నాయకులు ఆశీర్వదించారు. భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉన్నదని పెళ్లి కూతురు సంతోషం వ్యక్తం చేశారు. తిరిగి నెల రోజుల్లో దుబాయ్ వెళ్ళిపోతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భారతీయ సాంప్రదాయం ఇక్కడి వారి ప్రేమ ఆప్యాయత ఎంతో బాగుంటుందని తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇక్కడి పద్ధతులు తెలుసొచ్చాయని నేపాల్ వధువు తన మనసులో మాట వారి కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >