| Daily భారత్
Logo




రేపు జరిగే బీసీ బంద్ కు సర్వత్ర మద్దతు

News

Posted on 2025-10-17 18:02:19

Share: Share


రేపు జరిగే బీసీ బంద్ కు సర్వత్ర మద్దతు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బీసీ బంద్ కు మద్దతు గా శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో  జర్నలిస్టుల అన్ని యూనియన్లు, జర్నలిస్టులు పూర్తి మద్దతును తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్రం బీసీ బంద్ కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బీసీలకు ఎన్నో సంవత్సరాల నుండి అన్యాయం జరుగుతుందని, బీసీ లకు న్యాయం చేయుటకు నేటికైనా బీసీ లందరికీ 42% రిజర్వేషన్ కల్పించుటకు పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు, అందుకు అన్ని కుల సంఘాలు , న్యాయవాదులు, వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, పాటీగల్లి మున్నూరు కాపు సంఘం నాయకులు కూడా శనివారం నిర్వహించే బంద్ కార్యక్రమానికి పూర్తి మద్దతును తెలిపారు.  తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ పోరాటం ప్రారంభం మాత్రమే అని , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టం అయ్యేంతవరకు ఉద్యమంల కొనసాగుతూనే ఉంటుందని, అందుకు బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే ఊవ్వేతునా కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అదేవిధంగా బీసీల రిజర్వేషన్ 42 శాతం అయ్యే అంతవరకు బిసి ఉద్యమం అంతవరకు కొనసాగుతూనే ఉంటుందని బీసీ నాయకులు తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ చైర్మన్ పోతనకల్ లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ బొబ్బిలి నరసయ్య, రాష్ట్ర ఆర్య క్షత్రియ వైస్ ప్రెసిడెంట్ అంబదాసరావు, బీసీ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆదె ప్రవీణ్,  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ బైర శేఖర్, ఆర్గనైజ్ సెక్రెటరీ మండే మోహన్,  సీనియర్ జర్నలిస్టులు జమాల్పూర్ గణేష్ , పాకాల నర్సింలు, గంగాదాస్, రాజేష్, పంచారెడ్డి శ్రీకాంత్, రజినిష్, గంగారెడ్డి, సతీష్ గౌడ్, నరసయ్యచారి, వెంకటేష్, రామచంద్ర రెడ్డి, సంగీత , శంకర్, వినోద్ కుమార్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >