| Daily భారత్
Logo




శనగ రైతులకు అండ‌గా ఉంటాం : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

News

Posted on 2025-10-17 17:58:53

Share: Share


శనగ రైతులకు అండ‌గా ఉంటాం : వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

రైతు ప్రయోజనాలే కూట‌మి ప్రభుత్వానికి ప్రాధాన్యం

ర‌బీ సీజ‌న్ లో స‌బ్సీడీపై శ‌న‌గ విత్తనాలు అంద‌చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

డైలీ భారత్, అమ‌రావ‌తి: రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా శనగ పంట సాగు చేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతు అభ్యున్నతే మా లక్ష్యం. ప్రతి రైతు అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఇప్పటికే జిల్లాల వారీగా అంచనా వేస్తోందని, ప్రతి రైతు అవసరాలకు సరిపడే విత్తనాలు అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రైతు కష్టపడి పండించే ప్రతి గింజ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని అన్నారు. రైతు కోసం కొత్త ఆలోచనలు, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం లాభదాయకంగా మారాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్ర‌బాబు ప్రత్యేక దిశానిర్దేశాలు ఇచ్చారు. రైతు ఆదాయాన్ని పెంచే ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.

Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >
Image 1

కేరళ తరహాలో మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలి

Posted On 2026-04-11 16:25:00

Readmore >
Image 1

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-11 16:20:14

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Posted On 2026-04-11 16:16:39

Readmore >
Image 1

అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Posted On 2026-04-11 16:14:19

Readmore >
Image 1

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

Posted On 2026-04-11 16:12:01

Readmore >
Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >