| Daily భారత్
Logo




అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

News

Posted on 2026-04-11 16:14:19

Share: Share


అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వ్యసన బాధితులకు సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

అనంతరం అదే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా మత్తు వ్యసనానికి గురైన వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు, నిపుణుల పర్యవేక్షణలో పునరావాస సేవలు, నిరంతర కౌన్సిలింగ్ అందించబడతాయని వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మద్యానికి బానిసై చికిత్స కోసం వచ్చిన రోగితో మాట్లాడి, రోజువారీ ఆదాయం, మద్యంపై ఖర్చు వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ వ్యక్తి తాను మద్యం మానేందుకు పలు మార్లు ప్రయత్నించినప్పటికీ, వణుకుడు, ఫిట్స్ వంటి సమస్యలు రావడంతో చికిత్స కోసం ఈ కేంద్రానికి వచ్చానని తెలిపాడు. ఈ తరహా కేసులకు అందిస్తున్న వైద్య సేవలు, కౌన్సిలింగ్ విధానాలు, చికిత్స ప్రక్రియ గురించి కలెక్టర్ అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునేలా సమగ్ర చికిత్సతో పాటు నిరంతర కౌన్సిలింగ్ అందించాలని వైద్యులకు సూచించారు.

ఇదే సందర్భంగా “డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే” కార్యక్రమం కింద నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్ ప్రశంస పత్రాలు, శిల్డులను అందజేశారు. యువతలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

మత్తు వ్యసన నిర్మూలనలో ప్రభుత్వ శాఖలు, వైద్య విభాగం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు బాధితులను ప్రోత్సహించి, ఈ కేంద్రం సేవలను వినియోగించుకునేలా సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, ఆసుపత్రి సూపర్డెంట్ రమేష్, డాక్టర్ రాధిక, డాక్టర్ రాదా మోహన్, ఇతర వైద్యులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >
Image 1

కేరళ తరహాలో మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలి

Posted On 2026-04-11 16:25:00

Readmore >
Image 1

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-11 16:20:14

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Posted On 2026-04-11 16:16:39

Readmore >
Image 1

అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Posted On 2026-04-11 16:14:19

Readmore >
Image 1

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

Posted On 2026-04-11 16:12:01

Readmore >
Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >