Posted on 2025-10-15 16:25:23
రైలు కిందపడి ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య
జిల్లాలో వరుసగా ఆత్మహత్య ఘటనలు..
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి..
ఉలిక్కిపడ్డ ఉమ్మడి జిల్లా వాసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆత్మహత్యలు చేసుకోవడమే అన్నిటికీ పరిష్కారమా.. ఆత్మహత్యలు చేసుకునే వారు వారు ఆ ఘటనకు పాల్పడే ముందు ఓ క్షణం తన కుటుంబం భార్య పిల్లల గురించి సమాజం గురించి ఆలోచించాలి. కానీ బుధవారం నిజామాబాద్ లో మూడు ప్రాణాలు కొద్దిపాటి ఆవేశంతో అనంత లోకాలకు వెళ్లాయి. నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు వివిధ కారణాలతో వివిధ ఘటనలు వేరువేరుగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం ఒకేరోజు ముగ్గురు వేరే వేరే ఘటనలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన జిల్లా వాసులను కలవరపరుస్తుంది. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ అనారోగ్య సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. బుధవారం ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య గతంలో ఒకదాని వెనుక ఒకటి జరుగుతూనే ఉన్నాయి . ఉదయం గాయత్రి నగర్ కు చెందిన మోత్కూరి కిషన్ అనే యువకుడు కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా, అది మరవక ముందే శివాజీ నగర్ కు చెందిన ఓ కుటుంబం కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకుశివాజీ నగర్ కు చెందిన ఓ కుటుంబం కుటుంబ కలహాలతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుటుంబ పెద్ద దాసరి కిషన్ మృతి చెందగా మిగతావారు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషయమునంఆరోగ్య పరిస్థితి పూర్తి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ లో మెరుగైన చికిత్స నిమిత్తం వారి బంధువులు తరలించారు. ఈ ఘటన మరువకముందే మళ్లీ రైలు కిందపడి ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకుందని రైల్వే ఎస్సై సాయి రెడ్డి బుధవారం తెలిపారు. దుబ్బా ప్రాంతానికి చెందిన మీరా అను (ట్రాన్స్ జెండర్) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. నిజామాబాద్-జానకంపేట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఇది ఇలాగ ఉంటే కామారెడ్డి జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలవరపరుస్తుంది.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >