Posted on 2025-10-15 17:16:30
సిపిఆర్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సిపిఆర్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వినూత్న రీతిలో ప్లాస్మాబ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఆర్ వైద్య చికిత్స పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికోలు డాన్స్లు చేస్తూ, పాటలు పాడుతూ సిపిఆర్ వైద్య చికిత్సపై దాని పద్ధతులపై వివరించారు. ఈ కార్యక్రమంలో ద్వారా వారు చేసే నృత్యాన్ని అటువైపున వెళ్లే వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయంలో సిపిఆర్ చేస్తే ఒకరి ప్రాణాలు కాపాడిన వారు అవుతామని వారు పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి సిపిఆర్ వైద్య చికిత్సపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే వైద్యంలో ఉన్నావా డాక్టర్లు ఎవరు ఒకరి ప్రాణాలు తీయాలని కోరుకోరని వారికి సాధ్యమైనంత వరకు ఒకరి ప్రాణాలు కాపాడాలని లక్ష్యంతోనే వైద్యం అందిస్తారని, ఇది తెలియక కొందరు వైద్యుల నిర్లక్ష్యంతోనే కావాల్సిన వారు మృతి చెందారని వైద్యులపై ఆసుపత్రులపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వారు అన్నారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్, ప్రొఫెసర్లు డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ నాగ మోహన్ రావు, విజయ్ కిషోర్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >
ఎస్.ఆర్ నగర్ పోలీసుల కృషి.... పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు
Posted On 2026-04-13 19:09:44
Readmore >