| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలింపు

డైలీ భారత్, ​మహబూబాబాద్/కొత్తగూడ : ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను తాకడంతో తీవ్రంగా గాయపడిన ఘటన కొత్తగూడ మండలం మాసంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.​మాసంపల్లి గ్రామానికి చెందిన లావుడ్య వాగా కుమార్తె లావుడ్య కావ్యశ్రీ (9) సోమవారం తన ఇంటి మేడ (స్లాబ్) పై ఆడుకోవడానికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటి పైభాగం నుండి వెళ్తున్న మెయిన్ లైన్ విద్యుత్ తీగలను బాలిక గమనించకుండా పట్టుకుంది.​విద్యుత్ తీగలు తాకగానే బాలికకు తీవ్రంగా షాక్ కొట్టింది.

​షాక్ ప్రభావంతో బాలిక స్లాబ్ పై నుండి ఒక్కసారిగా కిందపడిపోయింది.

​దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.​ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్ గోవర్ధన్, ఈఎంటి (EMT) రాంబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, మెరుగైన వైద్యం కోసం అత్యంత వేగంగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

​ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారి త్వరగా కోలుకోవాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

Previous నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Next రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత
ADVERTISEMENT