Posted on 2025-10-15 13:51:40
భర్త మృతి, భార్య, కుమారుడి పరిస్థితి విషమం
డైలీ భారత్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. కుటుంబ కలహాల కారణంగా తరచూ గొడవలు పడే ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇరువురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు సంబంధిత రెండవ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. శివాజీ నగర్‌లో నివాసం ఉండే దాసరి కిషన్, నాగమణి దంపతులకు దాసరి వంశీ, దాసరి బాలకృష్ణ ఇద్దరు కుమారులు ఉన్నారు
వీరిలో ఒక కుమారుడికి వివాహం కాగా మరో కుమారుడి వివాహం విషయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో తరచూ గొడవలు పడే వారిని తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం తల్లి తండ్రితో పాటు పెద్ద కుమారుడు మధ్య గొడవ జరగగా తాను ఆత్మహత్య చేసుకుంటానని పెద్ద కుమారుడు వంశీ పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న తండ్రి కిషన్ తో పాటు తల్లి నాగమణి సైతం కొడుకు చేతిలోంచి పురుగుల మందు డబ్బా లాక్కొని వారు కూడా పురుగుల మందు తాగేశారు. ఇంట్లో వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం చుట్టుపక్కల వారితో పాటు బయటి వ్యక్తులకు సైతం తెలియకుండా పోయింది.
రాత్రి సమయంలో వారి బంధువులు వచ్చి చూడగా పురుగుల మందు సేవించిన ముగ్గురు అపస్మాక స్థితిలో పడి ఉన్నారు. గమనించిన వారు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కాగా, దాసరి కిషన్ (68) అప్పటికే మరణించగా ఆయన భార్య దాసరి నాగమణి, కుమారుడు దాసరి వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ ఇరువురి పరిస్థితి సైతం విషమంగా ఉందని సమాచారం. మృతుని చిన్న కుమారుడు దాసరి బాల కృష్ణ ఫిర్యాదు మేరకు రెండవ టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >