| Daily భారత్
Logo




గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-09-07 13:10:07

Share: Share


గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రకృతికి జలకళ శుభ సూచకం

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

గంగమ్మ తల్లిని మనసారా పూజిస్తా

గుర్రంపల్లి గ్రామ చెరువు నిండి అలుగు పారుతున్న సందర్భంగా పూజలు

వినాయక చవితి రోజున ఎమ్మెల్యే చెరువుల పర్యటన

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుల నుండి అలుగులు పారుతున్న సందర్భంగా ప్రకృతి మొత్తం జలకళను సంతరించుకుందని ఇది ఎంత సంతోషకరమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆనంధం వ్యక్తం చేశారు.

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామ చెరువు నిండి అలుగు  పారుతున్న సందర్భంగా గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన షాద్ నగర్  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, చౌదర్ గూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు, కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఈ పూజా కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతుందని వ్యవసాయ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ పై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసినా ఇతర విమర్శలు చేసినా ..ప్రతి రైతుకు రుణమాఫీ అదే విధంగా మాత్రం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కొన్నిచోట్ల బ్యాంకర్లు సంబంధిత అధికారుల తప్పిదాలతో జాతీయం ఏర్పడిందని, రుణమాఫీ చేసేందుకు కొంతమందికి సాంకేతిక కారణాలు ఏర్పడ్డాయని మిగతా అన్నిచోట్ల స్పష్టత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ లభించిందని అన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి తమ అధినేత రాహుల్ గాంధీ మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయడంతో రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతృప్తితో ఉన్నాయని, ఈ వినాయక చవితి రోజున కార్యకర్తలు ప్రజలు తనను గ్రామాలకు ఆహ్వానించడం చెరువులు కుంటలు నిండి అలుగులు పారుతుంటే తనతో కలిసి కేరింతలు కొట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అలుగు పూజలు చేసిన అనంతరం బ్యాండ్ మేళాలతో కార్యకర్తలు హుషారుగా చిందులేస్తుంటే వారిని చూసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం నృత్యం చేశారు. కార్యకర్తలలో ఉషారునింపారు..

Image 1

చలివేంద్ర కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమస్యలపై వినతి

Posted On 2026-04-13 17:33:33

Readmore >
Image 1

జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం

Posted On 2026-04-13 17:32:13

Readmore >
Image 1

కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం

Posted On 2026-04-13 17:30:28

Readmore >
Image 1

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు

Posted On 2026-04-13 17:28:31

Readmore >
Image 1

వివాహిత హత్య కేసులో ప్రియుడు అరెస్ట్

Posted On 2026-04-13 16:39:06

Readmore >
Image 1

Arrive Alive అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం

Posted On 2026-04-13 16:25:36

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-13 16:20:40

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ దొంగతనం

Posted On 2026-04-13 16:18:09

Readmore >
Image 1

రిలే నిరాహార దీక్ష

Posted On 2026-04-13 16:16:21

Readmore >
Image 1

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP

Posted On 2026-04-13 16:09:23

Readmore >