డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి కార్యాలయంలో శనివారం వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని అధిష్టించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు అదే విధంగా జమాల్పూర్ చందులాల్, విష్ణువర్ధన్ రెడ్డి, మురళి, ఇంద్రారెడ్డి, నవీన్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు ఈ పూజలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రజలు ఎల్లవేళలా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా స్వామిని కోరినట్లు తెలిపారు..
News
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో గణేష్ చతుర్థి పూజలు