| Daily భారత్
Logo




భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

News

Posted on 2026-04-12 13:50:08

Share: Share


భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

డైలీ భారత్, జగిత్యాల జిల్లా: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. అయితే ఈ గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు. వెలగటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి(48), పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.

కొంతకాలం వరకు సవ్వంగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాలు చోటుచేసుకున్నాయి. భార్య భర్తల మధ్య గొడవలు కాగా తన పిల్లలతో పుట్టింటికి వెళ్ళింది భార్య పద్మ. తన భార్యను పద్మ తల్లి రాజవ్వ కాపురానికి పంపడం లేదని కోపం పెంచుకొని హతమార్చలని ప్లాన్ వేశాడు అల్లుడు గాగిరెడ్డి మల్లారెడ్డి. రాజవ్వ ఇంటి తలుపులకు విద్యుత్ అమర్చాడు. ఉదయం తలుపులు తెరువగానే రాజవ్వకు స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలింది. అల్లుడు మల్లారెడ్డి పై అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు వెల్గటూర్ పోలీసులు తెలిపారు.

Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >