Posted on 2026-04-12 12:10:38
డైలీ భారత్, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సర్వారెడ్డి కాలనీ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం, ఆ గోదాంలో డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచారు. ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ వంటి వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >