| Daily భారత్
Logo




వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య

News

Posted on 2026-04-16 11:11:21

Share: Share


వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య

ప్రియుడు, సుపారీ గ్యాంగ్ తో కలిసి పాశవిక హత్య

 –పరకాలలో సంచలనం

డైలీ భారత్, హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ (35) ఈనెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

దర్యాప్తులో బయటపడిన విషయాలు షాకింగ్‌గా మారాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సుమన్‌ను అతని భార్య లావణ్య అత్యంత పాశవికంగా హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

సుమన్ భార్య లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డంకిగా భావించిన లావణ్య, తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.

ప్రియుడు సహా మరో 8 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను తీసుకొని ఈనెల 4న ములుగు జిల్లా దయ్యాలవాగు సమీపానికి సుమన్‌ను తీసుకెళ్లి, అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >