| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశం మందిరం లో నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష  సమావేశం  లో జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్ 

పాల్గొని మాట్లాడుతూ అర్హులైన వారికి  అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, 252 

జి ఓ  ననుసరించి నియమ నిబంధనలు తప్పకుండ పాటించాలని అన్నారు.

మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని  కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు.

మీడియా రంగంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ విక్టర్, dpro తిరుమల, కమిటీ సభ్యులుగా 

వి. రజనీకాంత్, మంత్రి ఆంజనేయులు, వుక్కల్కర్ రాజేందర్‌నాథ్, వేణుగోపాల చారి, సయ్యద్ కౌసర్ అలీ, 

వి. శశిధర్, షేక్ మొయినుద్దీన్, బొక్కల వేణు, గంట చంద్ర శేఖర్, మహమ్మద్ ఆబిద్ , తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Next కలెక్టరేట్ లో కీచకుడు
ADVERTISEMENT